శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (08:09 IST)

వాల్మీకి కోసం పూజ.. రూ.2 కోట్ల డిమాండ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కుర్రకారు హీరోయిన్ పూజ. "ఒక లైలా కోసం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన "ముకుంద" చిత్రంలో కనువిందు చేసింది. పిమ్మట అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథమ్" చిత్రంలో కుర్రకారును పిచ్చెక్కించింది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "మహర్షి" చిత్రంలో నటించింది.
 
ఈ క్రమంలో వరుణ్ తేజ్ నటించే కొత్త చిత్రం వాల్మీకిలో పూజా హెగ్డేను ఎంపిక చేయాలని భావించారట. ఇదే విషయంపై ఆమెను సంప్రదించగా, ఆమె నో చెప్పిందట. పైగా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటం కూడా ఆమెకు నచ్చలేదట. కానీ, దర్శకనిర్మాతల పట్టువిడవకుండా ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించదట. 
 
అయితే, 15 రోజులు షూట్‌లో పాల్గొనేందుకు పూజ రూ.2 కోట్లు పారితోషికంగా అడిగినట్లు చెబుతున్నారు. దీనికి కూడా నిర్మాతలు ఓకే చెప్పేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాల్ని ప్రకటించనున్నారు. 'వాల్మీకి' సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ గుబురు గడ్డంతో కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.