శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (17:38 IST)

ఘనంగా ప్రారంభమైన పూర్ణ

Varun, Sonakshi Varma, Chaitanya Priya, C. Kalyan
Varun, Sonakshi Varma, Chaitanya Priya, C. Kalyan
వరుణ్ హీరోగా సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ నాయిక‌లుగా యం ఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై  టాలెంటెడ్ డైరెక్టర్ యం ఆర్ దీపక్ దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం పూర్ణ. లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న పూర్ణ చిత్రం ఫిలిం నగర్ ఫిలించాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ కెమెరా ఆన్ చేశారు.

ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్టును తెలంగాణ ఫిలింఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి చిత్ర యూనిట్ కి అందించారు.  అనంతరం ఏర్పాటైన పాత్రికేయుల సమక్షంలో హీరో వరున్, హీరోయిన్స్ సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ, దర్శక,నిర్మాత యం.ఆర్. దీపక్ నటులు విజయ్ భాస్కర్, ఆజాద్, కెమెరామెన్ కొల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
 
దర్శక,నిర్మాత యం ఆర్ దీపక్ మాట్లాడుతూ.. ప్రెజెంట్ సమాజంలో అమ్మాయిలపై అనేక హత్యాచారాలు జరుగుతున్నాయి. వాటినుండి అమ్మాయిలు తమకి తాము ఎలా కాపాడుకోవాలనేది మా చిత్ర కథాంశం. పూర్ణ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథని రెడీ చేయడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఒక చక్కని లవ్ స్టోరీ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్న, మోహన్గా వడ్లపట్ల, ఫిలించాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారికి నా కృతజ్ఞ్తతలు. అతి త్వరలోనే మా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం.. అన్నారు.   
 
హీరో వరుణ్ మాట్లాడుతూ.. ఒక మంచి చిత్రం ద్వారా హీరోగా లాంచ్ అవ్వాలని చాలా కాలంగా వెయిట్ చేసి.. చాలా కథలు విన్నాను.. ఫైనల్ గా దీపక్ గారు చెప్పిన స్టోరీ నచ్చడంతో ఇమ్మీడియట్ గా ఒకే చేశాను.. పూర్ణ క్యారెక్టర్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది. వెరీ చాలెంజింగ్ క్యారెక్టర్ నాది. అసలు భయం అంటే తెలీని ఒక కుర్రాడు అనుక్షణం భయపడుతూ వుండే ఒక అమ్మాయికి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చి ఆ అమ్మాయిని ఒక  ఫైర్  బ్రాండ్ లా తీర్చి దిద్దాడు అనేది  స్క్రీన్ పై చూడాల్సిందే.. ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్తామా అని వెయిట్  చేస్తున్నాం. కచ్చితంగా పూర్ణ చిత్రం బ్లాక్ బస్టర్  అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను  అన్నారు. 
 
హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నాను. ప్రెజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. మా దర్శకులు దీపక్ గారు సబ్జెక్టు చెప్పగానే చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఇంత మంచి క్యారెక్టర్ నాకు  ఇచ్చిన దీపక్ గారికి నా థాంక్స్ అన్నారు.