ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం
టాలీవుడ్ ప్రముఖ నటి రజిత అందరికి తెలుసు. శుక్రవారం మధ్యాహ్నం రజిత అమ్మగారు విజయలక్ష్మీ (76) గారు గుండెపోటుతో మరణించారు. క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు. విజయలక్ష్మీ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. నటి రజిత గతంలో నాయికగా నటించింది. డా. డి.రామానాయుడు సినిమాలలో ఎక్కువగా నటించింది. పలువు అగ్ర నిర్మాణ సంస్థలలో నటించి తన దైన ముద్ర వేశారు. ఇక టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. మహాప్రస్తానంలో విజయలక్మిగారి అంత్యక్రియలు జరగనున్నాయి.