శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (10:03 IST)

30 ఏళ్లకే యువనటుడు కరోనాతో మృతి.. అస్సాంలో సంచలనం

Kishor Das
Kishor Das
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్లకే యువనటుడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్.. కరోనా సోకండంతోనే మృతి చెందాడని, అతడిని కాపాడడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. 
 
కిషోర్ మరణం ప్రస్తుతం అస్సాంలో సంచలనం సృష్టిస్తోంది. పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకుండానే కిషోర్ మృత్యువాత పడడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అతడి అంత్యక్రియలు చెన్నైలోనే నిర్వహించనున్నారు.
 
కరోనా సోకడంతో అతడి స్వస్థలానికి బాడీని పంపించబోయేది లేదని వైద్యులు తెలిపారు. దీంతో తమ అభిమాన నటుడు చివరి చూపుకు కూడా అభిమానులు నోచుకోలేకపోవడం విచారకరం. ఇక కిషోర్ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు అతడికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.