సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (08:26 IST)

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహిరి బుధవారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 69. బప్పీలహిరి 1970-80ల చివరలో 'చల్తే చల్తే', 'డిస్కో డాన్సర్', 'షరాబి' వంటి అనేక చిత్రాలలో ప్రసిద్ధ పాటలను అందించారు.

 
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి పాటలు అందించారు. అవన్నీ సూపర్ హిట్. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రం పాటలు కూడా ఆయన స్వరపరిచనవే. 2020లో విడుదలైన 'బాఘీ 3' చిత్రానికి సంబంధించిన భంకస్ అనే అతని చివరి బాలీవుడ్ పాట.

 
గత ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారు.