గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (11:08 IST)

బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్!! స్ట్రాంగ్ బాడీ అయినా వైరస్ సోకిందట...

తెలుగు సినీ నటుడు, టీవీ యాంకర్ బిత్తిరి సత్తికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా కరోనా లక్షణలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స‌త్తి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా త‌న‌కి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిందని స్పష్టం చేసాడు. పైగా, ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి, ఏమేం చేయాల‌నేది వివ‌రించాడు.
 
ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు చెప్పుకొచ్చిన బిత్తిరి స‌త్తి .. త‌న‌కు ఎక్క‌డ నుండి ఎలా వ‌చ్చిందో తెలియ‌దు కాని మొత్తానికి వ‌చ్చింది. పెద్ద‌గా ల‌క్ష‌ణాలు ఏమి లేవు కానీ, డాక్ట‌ర్ చెప్పిన స‌ల‌హాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నా. మంచి ఆహారం తీసుకుంటూ, క‌షాయం, ఆవిరి ప‌డుతూ ఆరోగ్యంగానే ఉన్నాను అని వివరించాడు. 
 
మనం ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు కరోనా లక్షణాలు బయటపడవని.. ఎప్పుడైతే విశ్రాంతి లేకుండా పనిచేస్తామో లేదంటే సమయానికి తినకుండా ఇష్టమొచ్చినట్టు ఉంటామో అలాంటి సందర్భాల్లో కరోనా మనపై పైచేయి సాధిస్తుందని సత్తి తెలిపారు. క‌రోనా వ‌చ్చిన విష‌యాన్ని దాచిపెట్ట‌డం చాలా త‌ప్పు. దాని వ‌ల‌న ఇత‌రులు ఇబ్బంది ప‌డ‌తారు. 
 
మ‌రోవైపు క‌రోనా వ‌చ్చిన వారిని దేశ‌ద్రోహుల్లా చూడొద్దు. వారికి కొండంత ధైర్యం అందించాలి. స్ట్రాంగ్ బాడీ అయిన కూడా నాకు క‌రోనా సోకింది. ప్ర‌స్తుతానికి అయితే పెద్ద‌గా ఇబ్బంది లేదు. ఇంట్లోనే ఉంటూ క‌రోనా వైద్యం తీసుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు.