శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (06:34 IST)

పోర్న్‌సైట్లు లైంగిక నిగ్రహానికి మార్గమట... రామ్ గోపాల్‌వర్మ ట్వీట్

లైంగిక నిగ్రహానికి పోర్న్‌వెబ్‌సైట్లు ఒక మార్గమని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అభిప్రాయపడ్డారు. కేంద్రం వాటిని నిషేధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అది తిరోగామి చర్య అంటూ వరుస ట్వీట్లు చేశారు. 
 
లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేన్నైనా నిషేధిస్తే అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏరూపంలోనైనా హరిస్తే అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుంది. 
 
అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, పైగా లైంగిక నిగ్రహానికి అది ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేల్లో నిరూపితమైన సత్యమని ట్వీట్‌ చేశారు. పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా.. ఆ కంటెంట్‌ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం చూడాలన్నారు.