సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (13:36 IST)

కేసీఆర్‌తో బంధుత్వం లేదు.. కానీ మళ్లీ సీఎంగా ఆయనే.. : పోసాని కృష్ణమురళి

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్‌తో తనకెలాంటి బంధుత్వం లేదనీ కానీ, ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్‌తో తనకెలాంటి బంధుత్వం లేదనీ కానీ, ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేసీఆర్‌ను వందేండ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకొంటారన్నారు.
 
తెలంగాణ రాజకీయాలను ఫాలో అవుతున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ మళ్లీ సీఎంగా ఉంటారు, తెలంగాణలో గెలుస్తారు, తప్పకుండా గెలువాల్సిందే అని పోసాని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆంధ్రా వాళ్లకు కొత్తేమీ కాదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చారిత్రాత్మకం. ప్రతిఒక్కరు మెచ్చుకోవాల్సిందే అని కొనియాడారు. దేశంలో ఏ సీఎం చేయలేనివిధంగా పాలన చేస్తున్నారన్నారు. 
 
సీఎం కేసీఆర్‌తో తనకెలాంటి బంధుత్వం లేదని, అయినా సంక్షేమ పథకాలను చూసి సీఎం కేసీఆర్‌కు ఓటేస్తానని చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌తో చాలా ప్రయోజనం జరిగిందని, ఒక టర్మ్‌లో రాష్ట్రానికి ఇంత సేవచేసిన సీఎంలు దేశంలో ఎవరూ లేరని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పెద్ద ప్రాజెక్టును దేశంలో ఎవరూ నిర్మించలేదని, కానీ సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టుతో సగం తెలంగాణ బాగుపడుతుందని పోసాని అభిప్రాయపడ్డారు.