శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (13:39 IST)

ఆదిపురుష్‌కు ఒక్క కట్ కూడా లేదు.. నిడివి మాత్రం..?

adipurush poster
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తిరుపతిలో అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. 
 
అలాగే రిలీజ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇందుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కేవలం ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సాగింది. ఇంకా యూ రేటింగ్ ఇచ్చింది సెన్సార్. 
 
ఈ చిత్రం రన్ టైం ఏకంగా 179 నిముషాలు. అంటే 2 గంటల 59 నిమిషాల నిడివి అన్నమాట. ఇంత నిడివి సినిమాపై ఆసక్తిని తగ్గించవచ్చు. మరి కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో వేచి చూడాలి.