సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (16:53 IST)

'ఆదిపురుష్'కు శుభవార్త - తెలంగాణాలో టిక్కెట్ల ధరల పెంపునకు ఒకే

Aadipurush poster
ప్రభాస్ - కృతిసన్ జంటగా నటించిన "ఆదిపురుష్" ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే, ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణాల్లో అదనపు షోకు అనుమతి ఇచ్చారు. అలాగే, టిక్కెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు కూడా సమ్మతించింది. అయితే, ఏపీలో మాత్రం అదనపు షోకు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది.
 
అయితే, మొదటి మూడు రోజులు మత్రమే పెంపునకు అనుమతి ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, థియేటర్లలో ఆరో షోకు ఒకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉదయం 4 గంట నుంచి 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్రదర్శించుకోవచ్చని వెల్లడించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.175గా ఉండగా, ఈ ధరపై రూ.50 పెంచుకోవచ్చని తెలిపింది. 3డీ గ్లాస్ ధరలను అదనంగా వసూలు చేయనున్నారు. ఏపీలోనూ రూ.40 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కానీ, అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.