శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (14:04 IST)

బాహుబలి 2కి తర్వాత ప్రభాస్, అనుష్కలకు డుం.. డుం..డుం..!?

బాహుబలి జంట త్వరలోనే రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు కానున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలిలో ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఏకం కానున్నారని  వార్తలొస్తున్నాయి. 
 
టాలీవుడ్ హీరోలే కాకుండా... హీరోలందరితోనూ లింక్ పెట్టి మాట్లాడుతున్నారని, ఇందంతా మామూలేనని వ్యాఖ్యానించిన అనుష్క... బాహుబలి 2తో పాటు చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తిచేసుకుని లైఫ్‌లో సెటిలయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ సినిమాలన్నీ పూర్తయ్యేందుకు దాదాపు రెండు లేదా మూడేళ్ల సమయం పడుతుందని అనుష్క స్పష్టం చేసింది.