శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:20 IST)

బాలయ్య హీరోయిన్ చీర‌కొంగు నోటితో ప‌ట్టుకొని చిందేసిన ప్ర‌భాస్..

బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ స్టార్‌గా మారిపోయారు. బాహుబలి-2 చిత్రం విడుదలై 2 సంవత్సరాలు దాటినా అతని ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంత గ్యాప్ తర్వాత ప్రభాస్ తాజాగా సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. 
 
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూలతో అదరగొడుతున్నాడు. తాజాగా హిందీలో ప్ర‌ముఖ టీవీ రియాలిటీ షోస్ అన్నింటికి హాజ‌రై త‌న సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 
 
షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై..’ పాటకు స్టెప్పులు వేశారు. ఈమె గతంలో బాలయ్యతో బంగారు బుల్లోడు సినిమాలో నటించారు. ప్రభాస్ రవీనాతో కలిసి వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క‌పిల్ శ‌ర్మ షోలోనూ ప్రభాస్ శ్ర‌ద్ధాతో క‌లిసి సంద‌డి చేసిన విష‌యం విదితమే. 
 
సాహో చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటించారు. ప్రభాస్ చిన్ననాటి స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగినందున తన రెమ్యునరేషన్‌లో కేవలం 20 శాతం మాత్రమే తీసుకున్నాడట, స్నేహితుల పట్ల, అలాగే సినిమా పట్ల ప్రభాస్‌కి ఉన్న ప్యాషన్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.