ట్రిపుల్ ఆర్‌ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

prabhas
Last Updated: శనివారం, 13 ఏప్రియల్ 2019 (15:27 IST)
ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించనున్నారు. జక్కన్న తెరకెక్కనున్నా ఈ చిత్రంలో అలియాభట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ భామను ఖరారు చేశాడు.. రాజమౌళి. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజాగా ఎన్టీఆర్‌తో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారు.
 
స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన కథలో.. విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ కనిపించనున్నారు. చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. 
 
ఎన్టీఆర్.. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈ వాయిస్ ఓవర్‌ను ప్రభాస్‌తో చెప్పిస్తున్నారట. ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల టాక్.దీనిపై మరింత చదవండి :