శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (05:01 IST)

హిందీ భాషపై పట్టుకోసం ప్రభాస్ పాట్లు.. బాలీవుడ్‌పై చూపే లక్ష్యం

బాహుబలి-2 సినిమాతో ఒక్క రాత్రిలో జాతీయ హీరో అయిపోయిన ప్రభాస్‌పై బాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది.. అలాగే ప్రభాస్ కన్ను కూడా బాలీవుడ్‌పై పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహో చిత్రం కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వస్తుండటంత

బాహుబలి-2 సినిమాతో ఒక్క రాత్రిలో జాతీయ హీరో అయిపోయిన ప్రభాస్‌పై బాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది.. అలాగే ప్రభాస్ కన్ను కూడా బాలీవుడ్‌పై పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహో చిత్రం కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వస్తుండటంతో వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను ముగిస్తే బాలీవుడ్ నుంచి వెల్లువలా వస్తున్న ఆఫర్లను అంగీకరించే విషయమై  నిర్ణయం తీసుకోవచ్చని ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కానీ బాలీవుడ్‌లో అడుగు పెట్టాలంటే ప్రధానమైన అడ్డంకి హిందీ. హిందీ ఒక్క అక్షరం కూడా రాకుండానే ప్రభాస్ దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలంటే హిందీ వెంటనే నేర్చేసుకోవాలి. ప్రభాస్ ఇప్పుడా పనిమీదే ఉన్నట్లు వినికిడి.
 
బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ హిందీ నేర్చుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ రెండు భాగాలను తెలుగులో తెరకెక్కించి తెలుగు, హిందీ, తమిళంలో డబ్బింగ్‌ చేశారు. కానీ సాహో సినిమాని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. ఇందుకోసం ‘బాహబలుడు’ హిందీలో డైలాగులు ప్రాక్టీస్‌ చేస్తున్నాడట.
 
యువీ క్రియేషన్స్‌ సంస్థ సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. బాలీవుడ్‌ సంగీత త్రయం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా నటించే కథానాయిక ఎంపిక విషయంలో యూనిట్‌ తర్జనభర్జన పడుతున్న విషయం తెలిసిందే.