Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒక స్టార్ ఆవిర్భవించిన వేళ.. ఒక గర్వం ఉదయించని వేళ.. బాహుబలి రాజమౌళిదే అంటున్న ప్రభాస్

హైదరాబాద్, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (01:47 IST)

Widgets Magazine

ఒక్క సినిమా.. అతడిని దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది గుర్తు పెట్టుకునే స్టార్‌ని చేసేసింది. ఒక దక్షిణాది హీరో, తెలుగు రాష్ట్రాల సరిహద్దులకు అవతల తానెవరో కూడా పెద్దగా తెలియని హీరో.. ఆ ఒక్కసినిమాతో జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గ్రాండ్‌గా పరిచయం అయిపోయాడు. ఒక్క రాత్రిలో దేశం కనీవినీ ఎరుగని స్టార్ హీరోగా మారినప్పటికీ తన దిశదశను మార్చిపడేసిన ఆ సినిమాలో తన పాత్ర ఏమిటి అని మాత్రమే చెప్పుకునే నిగర్విలా నమ్రతను కొనసాగిస్తూనే ఉన్నాడు. సినిమా కళపై రాజమౌళి క్రేజి ఫలితమే బాహుబలి. రాజమౌళిని గుడ్డిగా నమ్మి పనిచేశాను. తన కల నిజంకావడానికి నా సమయం మొత్తాన్ని కేటాయించాను. అంటూ మామూలుగా చెప్పటం ఈ హీరోకే చెల్లు. వాస్తవం ఏమిటంటే ఈ మెగా ప్రాజెక్టును ఈ హీరో నమ్మి ఉండకపోతే సినిమాయే సాధ్యమయ్యేది కాదు అని అంతటి రాజమౌళే ఘనంగా చెప్పాడు. ఒక ప్రాజెక్టు కోసం తన సినీ జీవితంలో మూడున్నరేళ్ల అమూల్యమైన సమయాన్ని అంకితం చేసే ఒక్క స్టార్‌ను నాకు చూపించండి, అప్పుడు నేను మరొక బాహుబలిని తీయడం గురించి ఆలోచిస్తాను అని రాజమౌళి చెప్పాడంటే ఆ హీరో ఎంత విశిష్ట వ్యక్తో అర్థమవుతుంది.
prabhas

 
అతడే బాహుబలి ప్రభాస్. అంతర్జాతీయంగా ప్రస్తుతం మారుమోగుతున్న బాహుబలి ఘన విజయం ద్వారా వచ్చి పడిన స్టార్ డమ్ సైతం అతడిని ఇసుమంత కూడా మార్చలేదు. కనీసం ఇప్పటివరకూ అయితే ఆతడు మారలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను బాహుబలి ప్రమోషన్ కేంపెయిన్‌లో ఇతరత్రా కొన్ని లక్షలసార్లు సంధించి ఉంటారు కానీ ప్రభాస్ విసుగు చెందలేదు. రాజమౌళితో పదేళ్లకు ముందు ఏర్పడిన స్నేహం రెండు భాగాల కాల్పనిక యుద్ధ సినిమా వరకు తీసుకొచ్చిందని చెప్పే ఆ నమ్రతను ఎలా మరవగలం? 
 
బాహుబలి 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియాకు ప్రభాస్ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని ఇక్కడ చూడండి.
 
బాహుబలికి ముందు రాజమౌళి ప్రభాస్‌తో ఏడెనిమిది కథలపై చర్చించాడు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పుట్టక, వికాసం గురించిన కథకూడా తను చెప్పాడు. కానీ తర్వాత 2012లో చివరగా బాహుబలి కథ చెప్పాడు. స్టోరీ లైన్ చెబుతుంటే నా మనసులో ఆ పాత్రలు అలా నిలిచిపోయాయి. కథను డెవలప్ చేసే క్రమంలో సినిమా చాలా పెద్దదిగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో అయితే రాజమౌళి నిర్మాతలను కూడా హెచ్చరించాడు. ఊహకు అందనంతగా బడ్జెట్ పెరిగిపోనుందని తెలిపాడు. అయినా సరే ముందుకు పోదామన్నారు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్. నిజానికి ఇలాంటి సినిమా ఇంతవరకు ఎవ్వరూ చూసి ఉండరు కనుకే ఈ సినిమాను మనం చేస్తున్నామని వారన్నారు.
 
నేను, రాజమౌళి వేరే సినిమాలు చేస్తే... ఇంకో ఎనిమిదేళ్లు పట్టేదేమో (నవ్వులు)! ఈ మహాయజ్ఞంలో నా వంతుగా మొదట నేను చేయాల్సింది ఏంటంటే... రాజమౌళికి టైమ్‌ ఇవ్వాలి. మధ్యలో నేనింకో సినిమా చేస్తూ... ‘క్లైమాక్స్‌ ఒక్కటే డార్లింగ్‌. రెండు రోజుల్లో వచ్చేస్తా’ వంటì  పర్మిషన్లు అడగ కూడదనుకున్నా. ‘బాహుబలి’ ఓ ప్రయోగం. ప్రతిదీ మాకు ఓ ఎక్స్‌పీరియన్సే. వార్‌ సీన్స్‌ 80 రోజులు అనుకుంటే 120 రోజులైంది. నేను మరో సినిమా చేస్తే, అది ప్లానింగ్‌ ప్రకారం జరక్కపోతే మరిన్ని సమస్యలు.
 
‘ధీవర..’ సాంగ్‌ చూశారు కాదా! మేఘాల పైనుంచి వాటర్‌ ఫాల్స్‌ రావడం ఏంటి రాజమౌళి తప్ప మరొకరు అలా ఆలోచించలేరు. కరణ్‌ జోహార్‌కు చూపిస్తే... ‘ఏంటిది ‘అవతార్‌’లా ఉంది’ అన్నారు. ఆ వాటర్‌ ఫాల్స్‌ సీక్వెన్స్‌ హాలీవుడ్‌ కంటే బాగా వచ్చిందని నా వ్యక్తిగత అభిప్రాయం. వార్‌ సీన్లూ బాగున్నాయి. హాలీవుడ్‌వి ఇంకా బాగుండొచ్చు.
 
మరొక బాహుబలి సినిమాను మళ్లీ తీసేంత మైండ్‌సెట్‌లో లేను. ‘బాహుబలి’ని ఎంజాయ్‌ చేశా. వెంటనే ఈ టైప్‌ మూవీకి ఎవరైనా అడిగి, అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అయితే చేస్తానేమో. పేరొస్తే ఏంటి రాకపోతే ఏంటి? నేను ఎంజాయ్‌ చేయలేనిది నాకెందుకు
 
కీరవాణి గారు నాకు గర్వం లేదన్నారు.. ఏమో... గర్వం లేనట్లు నటిస్తున్నానేమో!  ఇప్పుడీ సినిమాను ఉదాహరణగా తీసుకుంటే... నేను కథ రాయలేదు, దర్శకత్వం చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు గర్వపడాలి రాజమౌళిపై నమ్మకంతో, నాకు పేరు రావాలని చేశా.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టాలీవుడ్ సన్నీలియోన్... ఎవరో తెలుసా?

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీఎంట్రీ అవకాశం వచ్చేపాటికి ...

news

రాజమౌళి మహాభారతం వేరు.. శ్రీకుమార్ మేనన్ భారతం వేరు.. జక్కన్నకు ఢోకా లేదు..?!

వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మహాభారంతం రూపుదిద్దుకోనుందని వార్తలు రాగానే.. జక్కన్న ...

news

బాలీవుడ్ 'మహాభారతం'.. కృష్ణుడుగా అక్షయ్ కుమార్.. భీష్ముడు... ద్రౌపది... పంచ పాండవులుగా ఎవరు?

బాలీవుడ్ "మహాభారతం‌" నిర్మాణానికి నటీనటుల ఎంపికను పూర్తి చేశారు. శ్రీకృష్ణ పాత్రధారిగా ...

news

ఇళయరాజాని అడిగితే బెటర్... నేనైతే నోటీసులు పంపేవాడిని కాదు : కేజే. ఏసుదాస్

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం - సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంపై కామెంట్స్ ...

Widgets Magazine