శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

మిస్టర్ ప్రభాస్.. మమ్మల్ని చెడగొట్టేశావ్... హీరోయిన్ దిశాపటానీ

disha patani
యూనివర్శల్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ భామ దిశాపటాన్ జతకట్టనుంది. మిస్టర్ కె ప్రాజెక్టులో ఆమె భాగస్వామ్యం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం, ఆమె ప్రాజెక్టు సెట్స్‌లో భాగస్వామ్యం కావడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. 
 
అదేసమయంలో తాజాగా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని లొట్టలేసుకుని లాంగించేసింది. ఈ ఆహార పదార్థాలను రుచి చూసిన దిశా మైమరరిపోయింది. "థ్యాంక్యూ ప్రభాస్.. మమ్మల్ని చెడగొట్టేశావ్" అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 
 
స్లిమ్ లుక్ మెయింటైన్ చేసేందుకు నోరు కట్టుకుని మరీ డైటింగ్ నియమాలు పాటించే దిశా పటానీ... ప్రభాస్ పుణ్యమాని అన్ని రకాల వంటకాలు ఆరగించాల్సి వచ్చింది. అందుకే ఆ పొడుగుకాళ్ల సుందరి పై విధంగా స్పందించింది.