Widgets Magazine

బాహుబలి రెమ్యునరేషన్ 75 కోట్లా.. నిర్మాతల నుంచి బాగానే పిండాడు మరి..

హైదరాబాద్, శనివారం, 22 ఏప్రియల్ 2017 (02:34 IST)

Widgets Magazine

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో కూడా ఒక సినిమాకోసం అంత సమయం వెచ్చించలేదు... చిత్రం తీసిన రాజమౌళే ఆ సాహసానికి ఒడిగట్టిన హీరోను మ్యాడ్ ఫెలో అని ముద్దుగా పొగిడాడు. ప్రభాస్ లేకుంటే బాహుబలి సినిమా చేయడం చాలా కష్టమని ఇటీవల రాజమౌళి చెప్పుకొచ్చారు. అవును మరీ ఈ సినిమాకు ప్రభాస్ చూపించిన డెడికేషన్, కమిట్మెంట్ అలాంటివి. ఈ సినిమా కోసం తను వెచ్చించిన సమయం ఐదేళ్లు. బాహుబలి లేకుంటే,  ఈ ఐదేళ్లలో ప్రభాస్ కనీసం ఆరేడు సినిమాలు చేసేవారు. కానీ తన సమయాన్ని మొత్తం బాహుబలి కోసమే వెచ్చించాడు. మధ్యలో గ్యాప్ దొరికినా ప్రభాస్ మరో సినిమా చేయలేదు. మరి ఇంత కష్టపడ్డ ప్రభాస్‌కు తగిన ఫలితం దక్కిందా.. అంటే అంతకుమించే అని తెలుస్తోంది.
prabhas-tamannah
 
నిజానికి అప్పటివరకు 5 కోట్ల పారితోషికం తీసుకునే ప్రభాస్‌కు బాహుబలి కోసం ముందుగా 20 కోట్లు ఇవ్వాలనుకున్నారు చిత్రనిర్మాతలు. కానీ మొదటి పార్ట్ విడుదలైన తరువాత సినిమా మార్కెట్, కలెక్షన్స్ పెరగడంతో రెండు భాగాలకు గానూ ప్రభాస్ ఇచ్చిన డేట్స్‌కు మొత్తంగా కలిసి 75 కోట్లు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రాంతీయ హీరోగా ఒక భాషకే పరిమితం అయిన ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలికి ముందు ప్రభాస్ సినిమా పాతిక నుండి ముప్పై కోట్ల వరకు బిజినెస్ చేసేది కాని ఇప్పుడు ఆయన ఒక సినిమాకు ఆ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేశాడు.
 
రాజమౌళి దార్శనికతకు అచ్చెరువొంది ప్రభాస్ తన జీవితంలో అయిదేళ్ల కాలాన్ని ఆ సినిమా మీదే వెచ్చించాడు కానీ మరో దర్శకుడు అయితే ఆ సాహసానికి కూడా దిగేవాడు కాడేమో. ఈ విషయాన్నే ప్రభాస్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశాడు కూడా.. ఒక సినిమాకు 75 కోట్లా... అవునుమరి ఆ పాత్ర రేంజి అది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబోయ్... కరీనా క్రేజ్... సొగసు చూడతరమా... పారితోషికం తెలిస్తే దఢేల్...

బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ క్రేజ్ సెపరేటు. ఆమె కోసం పడిచచ్చేవారు విపరీతం. ఇకపోతే ...

news

నాగచైతన్యను భలే వాడేసుకుంటున్న సమంత... పర్ఫెక్ట్ కపుల్ అంటే...

ఇదివరకు అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్లు అని అనేసేవారు. కానీ ఆ సామెతను తిరగరాయాలని ...

news

ఫుల్లుగా మద్యం తాగాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త ...

news

జూనియర్ ఎన్టీఆర్‌‍కు మూడు సెటప్ రెఢీ... ఇక దున్నేయడమే ఆలస్యం...!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడో సెటప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆమెతో ఆడిపాడటమే ...