బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (08:39 IST)

ప్రభాస్‌కు సర్జరీ - ఆగియిపోయిన సాలార్ షూటింగ్

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌కు చిన్నపాటి సర్జరీ జరిగింది. ఇది "సాలార్" షూటింగ్‌పై ప్రభావం చూపింది. ఈ సర్జీరీ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. స్పెయిన్‌లో ఈ సర్జరీ జరుగగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈయన ఈ నెలలో కూడా విశ్రాంతి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో "సాలార్" షూటింగ్ మరింత జాప్యం కానుంది. 
 
'కెజిఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి ప్రభాస్ సెట్స్‌లో జాయిన్ కావాల్సివుంది. అయితే, సర్జరీ కారణంగా ప్రభాస్‌కు రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సలహా ఇవ్వడంతో ఈ షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో 'సాలార్' షూటింగ్ తాత్కాలికంగా రద్దు చేశారు. 
 
కాగా, ఇటీవల "రాధేశ్యామ్" ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఇపుడు వరుస ప్రాజెక్టుల్లో కమిట్ అయ్యారు. వీటిలో ఒకటి "సాలార్". ఆ తర్వాత "ఆదిపురుష్", "ప్రాజెక్ట్ కె", "స్పిరిట్", 'భలే భలే మగాడివోయ్' ఫేమ్ మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం ఇలా వరుస సినిమాల్లో కమిట్ అయ్యారు.