కళాకారులపై దాడులు చేస్తారా? ఏంటిది: ప్రకాష్ రాజ్ ప్రశ్న

శనివారం, 18 నవంబరు 2017 (12:02 IST)

Deepika Padmavati

బాలీవుడ్ నటి దిపికా పదుకొనే నటించిన పద్మావతి సినిమా వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి సెన్సారు బోర్డు తిరిగి పంపింది. పద్మావతిలో అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలంటూ రాజ్పుట్ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1న రిలిజ్ అవ్వాల్సిన పద్మావతి సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. దీపికా ప‌దుకొనే న‌టించిన ''పద్మావతి' సినిమాను విడుద‌ల చేస్తే విధ్వంస‌ం సృష్టిస్తామంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన చేస్తున్న వ్యాఖ్యల‌ను సినీన‌టుడు ప్రకాశ్ రాజ్ త‌ప్పుబ‌ట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. 
 
అయితే అన్ని భాష‌ల్లోనూ య‌థేచ్ఛగా వ‌స్తున్న అశ్లీల చిత్రాల‌ను ఖండించ‌ని వారు చారిత్రాత్మక సినిమాలో నటించిన కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాగా.. కర్ణిసేన పద్మావతిలో నటించిన దీపికా ప‌డుకొనే ముక్కుకోయాల‌ని, ఆమెను చంపితే రూ.5 కోట్లు ఇస్తామ‌ని క‌ర్ణిసేన ప్రక‌టించిన విష‌యం తెలిసిందే.దీనిపై మరింత చదవండి :  
Padmavati Deepika Intolerance Karni Sena Prakash Raj

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతారకు పుట్టినరోజు.. లేడి సూపర్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

దక్షిణాది అగ్రహీరోయిన్‌ అయిన నయనతారకు నేడు పుట్టినరోజు. 1984వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన ...

news

భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది ...

news

చీరకట్టులో అదిరిపోయిన సమంత.. స్టిల్స్ చూడండి

టాలీవుడ్ అగ్రహీరోయిన్, కొత్త పెళ్లి కూతురు సమంత తాజా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ ...

news

ఈఈబీఎఫ్‌ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) గ్లోబల్‌ ...