శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (16:22 IST)

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో ధీక్ష ప్రారంభం

Pratani Ramakrishna Goud,   Kiran, Bhavyashree
Pratani Ramakrishna Goud, Kiran, Bhavyashree
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ధీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ సహ నిర్మాత కాగా, పూర్ణ వెంకటేష్‌ కో`ప్రొడ్యూసర్‌. కిరణ్‌కుమార్‌`భవ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. 
 
ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, బ్రహ్మంగారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపుషాట్‌కు ఆర్‌.కె. గౌడ్‌ క్లాప్‌ను ఇవ్వగా, తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు, డా॥ యోగానందకృష్ణమాచార్య తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు, జెవిఆర్‌ & గురురాజ్‌లు స్క్రిప్ట్‌ను అందించారు.
 
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య మాట్లాడుతూ, ఈరోజు చాలా మంచి రోజు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ‘ధీక్ష’ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ చిత్రం రామకృష్ణగౌడ్‌ కి, నటీనటులు, టెక్నీషియన్‌లకు మంచి పేరు తీసుకు వస్తుంది అన్నారు.
 
ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ, ఇటీవల దర్శకత్వం వహించడంలో నేను కొంత గ్యాప్‌ తీసుకున్నాను. మంచి కథ కుదరడంతో మళ్లీ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను. ‘ధీక్ష’ మంచి కథాబలం ఉన్న సినిమా. అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉన్న కథ. మే 1వ తేదీ నుంచి షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌, దుబాయ్‌లో కూడా ఒక షెడ్యూల్‌ ఉంటుంది. దీక్ష, పట్టుదలతో ఏపని చేసినా తప్పకుండా సక్సెస్‌ అవుతుంది. ఇది ప్రతి మనిషి విషయంలోనూ జరిగేదే. ఈ విషయాన్ని బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. 
 
ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ఒక ఆడదాని విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉంటాడు.  పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మరో సినిమా చేయబోతున్నా. అందులో హీరో తేజ నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సాంగ్స్‌ కూడా కంప్లీట్‌ అయ్యాయి. మంచి క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీస్తాము. యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమిది. ఇకపై మా ఆర్‌.కె. ఫిలింస్‌ బ్యానర్‌పై కంటిన్యూగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు.
 
తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, ఆర్‌.కె. గౌడ్‌ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. మంచి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళామతల్లి సేవలో ఉండిపోయారు. ఆయన మళ్లీ అటు ప్రజా సేవలో కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం చాలా తపన పడుతున్నారు. కాబట్టి రామకృష్ణగౌడ్‌ గారు ఆయన జత కలిస్తే పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందని నా ఆశ. ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ‘ధీక్ష’ తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌ మాట్లాడుతూ,  ఈ చిత్రం విజయం తధ్యం. ఇప్పటికే ఎంతోమంది నటులు, టెక్నీషియన్‌లను పరిశ్రమకు పరిచయం చేశాం. వారు ఇప్పడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా కూడా మరింత మంది టాలెంటెడ్‌ వ్యక్తులు పరిశ్రమకు పరిచయం అవుతారు. అందరి ఆశీర్వాదాలు కావాలి అన్నారు.
 
హీరో, హీరోయిన్‌లు కిరణ్‌`భవ్యశ్రీలు మాట్లాడుతూ, మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఇంత మంచి సినిమాకు మమ్మల్ని సెలక్ట్‌ చేసుకున్న ఆర్‌.కె. గౌడ్‌ గారికి, ఇతర నిర్మాతలకు థ్యాంక్స్‌. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కావడం మా అదృష్టం. అందరికీ మంచి పేరు, పేరుతో పాటు అవార్డులు తెచ్చే సినిమా ధీక్ష అని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాం అన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేవీఆర్‌, నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్‌, రచయిత మేడ ప్రసాద్‌, నిర్మాత గిరి తదితరులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌కు రికార్డుల పంట పండిరచాలని కోరుకున్నారు. ధీక్ష చిత్రానికి సంబంధించి టెక్నీషియన్స్‌, నటీనటుల వివరాలో అతి త్వరలో ప్రకటించనున్నారు.