గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (13:08 IST)

బాలీవుడ్‌ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ మృతి

Praveen Kumar Sobti
బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ మృతి చెందారు. ఆర్బీ చోప్రా రూపొందించిన మహాభారతంలోని.. భీముడు పాత్రలో ప్రవీణ్ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, టీవీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
 
దాదాపుగా 20 సంవత్సరాలపాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాగా యాక్టివ్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్ సోబ్తీ 50కిపైగా హిందీ సినిమాలలో నటించి పలు సీరియల్స్‌లో కూడా నటించారు. మహాభారత్ సీరియల్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
ఇక ఇందులో భీముడు పాత్రలో ప్రాణం పోసి నటించాడు ఈ ప్రవీణ్ కుమార్. బాలీవుడ్‌లో "రక్ష" మూవీ ద్వారా తొలిసారిగా నటన రంగం వైపు అడుగు పెట్టాడు. ఆ తర్వాత జగీర్, జబర్దస్త్, మహా శక్తిమాన్, అగ్ని, కాళీ గంగా వంటి సినిమాలే కాకుండా ఇతర సినిమాల్లో సైతం నటించి మెప్పించాడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ. తెలుగులో కూడా ఒక మూవీలో నటించాడు.. ఆ సినిమానే కిష్కిందకాండ. ఈ సినిమాలో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నటించి మెప్పించాడు. ఇక నటుడిగానే కాకుండా ఒక స్పోర్ట్స్ ఛాంపియన్ గా కూడా సత్తా చాటించాడు.
 
ఇండియన్ హమ్మర్ , డిస్కస్ ద్రోవర్ వీటితో పాటు రాజకీయాలలోని బాగా పేరు పొందాడు. ఇక అంతే కాకుండా బిఎస్ఎఫ్‌లో కూడా జవాన్‌గా పని చేయడం జరిగింది.