మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:00 IST)

శ్రేయ ఘోషాల్ సీమంతం.. రకరకాల వంటలు.. ఫోటోలు వైరల్

Shreya Ghoshal
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషాల్ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను వివాహం చేసుకున్న శ్రేయ త్వరలో పండంటి బేబికు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఆమె ఆదివారం రోజు బేబి షవర్ వేడుక జరుపుకుంది.
 
ప్రస్తుతం కరోనా వలన మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉంది. ఈ క్రమంలో శ్రేయ ఆన్‌లైన్ బేబి షవర్ వేడుక జరుపుకుంది. పలు రకాల వంటలను తన ముందు ఉంచుకొని ఆస్వాదిస్తున్న ఫొటోతో పాటు ఆసక్తికర ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రేయ. శ్రేయ ఘోషాల్ తెలియని భారతీయుడు లేదంటే అతిశయోక్తి కాదు. పలు భాషలలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించిన శ్రేయ అనేక పురస్కారాలు కూడా అందుకుంది.
 
రీసెంట్‌గా తెలుగులో ఉప్పెన మూవీ కోసం శ్రేయా ఘోషల్ జల జల జలపాతం నువ్వు పాటను ఆలపించారు. జస్రిత్ జాజ్‌తో కలిసి శ్రేయా ఈ పాటను పాడగా.. ఇది అందరినీ ఆకట్టుకొని మంచి వ్యూస్‌ని సంపాదించిన విషయం తెలిసిందే.