శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (11:44 IST)

రోజా, అనసూయల ముందు షర్ట్ విప్పేసిన పృథ్వీ..చూడలేక..?!

సంక్రాంతి సెలవుల్లో ప్రతీ తెలుగింటా సంబరాలు నింపేలా జనవరి 16న ఈ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సీనియర్ హీరో పృథ్వీ సందడి కనిపించింది. అంతేకాకుండా ఓవరాక్షన్ అంతకంటే ఎక్కువగానే వుంది. తన ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్ ''రుక్కు.. రుక్కు.. రుక్కుమని..'' సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ.. పోలీస్ గెటప్‌లో పంచ్ డైలాగులతో ఇరగదీశాడు. 
 
అంతేకాదు షర్ట్ సిప్పేసి తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ హల్‌చల్ చేశాడు. రోజా ముందే ఆయన ఇలా షర్ట్ విప్పడం చూపరులకు షాకిస్తోంది. ఇక జబర్దస్త్ వేదికపై పృథ్వీ చేసిన ఈ ఫ్రీ షో చూసి రోజా నవ్వు ఆపుకోలేకపోయింది. మరోవైపు అనసూయాది కూడా అదే పరిస్థితి. ఇద్దరూ సిగ్గు మొగ్గలు వేస్తూ తెగ నవ్వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.