శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (18:42 IST)

గోపిచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ..

Priya bhavani
విలన్ కమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన 31వ చిత్రం "భీమ"లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
తాజాగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో కథానాయికగా రాణించనుంది. “కల్యాణం కమనీయం” సినిమాతో ఈమె తెలుగులోకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. అలాగే ఈ చిత్రంలో మాళవిక శర్మ కూడా నటిస్తోంది. రెడ్, నేల టికెట్ వంటి చిత్రాల్లో నటించింది.
 
 అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్‌గా నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.