గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (11:08 IST)

కెమెరా కంటికి చిక్కిన ప్రియాంకా చోప్రా - అతనితో కలిసి డిన్నర్‌కు...

బాలీవుడ్, హాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మరోమారు కెమెరా కంటికి చిక్కింది. తన ప్రియుడు, హాలీవుడ్ సింగ్ నిక్ జొనాస్‌తో కలిసి అమెరికాలోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది. దీంతో వీర

బాలీవుడ్, హాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మరోమారు కెమెరా కంటికి చిక్కింది. తన ప్రియుడు, హాలీవుడ్  సింగ్ నిక్ జొనాస్‌తో కలిసి అమెరికాలోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్త నిజమైంది.
 
నిజానికి గతకొన్ని రోజులుగా ఎక్కడికెళ్లినా ఇద్దరూ క‌లిసే వెళుతున్నారు. ఆ మ‌ధ్య ఓ బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వెళ్ళిన వారు రీసెంట్‌గా లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వచ్చినప్పుడే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తున్నదన్న పుకార్లు వచ్చాయి. ఇక డిన్నర్‌కు వెళ్లడంతో ఆ రూమర్లు నిజమేన‌ని అన్నారు. 
 
తాజాగా, అమెరికాలోని జాన్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రియుడితో క‌లిసి మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఏదో సీరియ‌స్ మాట్లాడుకుంటూ న‌డుచుకుంటూ వెళుతున్న వీరిద్ద‌రిని తమ కెమెరాల్లో ఫోటోగ్రాఫర్స్ బంధించారు. 
 
ప్ర‌స్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య త‌ప్ప‌క ఎఫైర్ ఉంద‌ని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, హాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక త్వ‌ర‌లో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.