ప్రియాంక డే ప్రధాన పాత్రలో నటించిన హసీనా విడుదలకు సిద్ధం
ఇప్పుడు కథ, కథనాలు బాగుంటే అన్ని జానర్లను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 19న రిలీజ్ చేస్తున్నారు.
హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా యంగ్ హీరోలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మే 19న థియేటర్లో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.