గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (13:01 IST)

డర్టీ హరి పేరుతో ఎం ఎస్ రాజు సినిమా.. బోల్డ్ సినిమానే క్లాసిక్‌గా వుంటుంది..

శత్రువు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం ఎస్ రాజు చాలా  కాలం తర్వాత ఓ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. డర్టీ హరి పేరుతో చాలా బోల్డ్‌గా ఈ మూవీ రానుంది. 
 
బాలచందర్, పుట్టన్న కనగల్ వంటి దర్శకులు అప్పట్లో చాలా బోల్డ్‌గా సినిమాలు తీసినా… బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌ ఉండేవి. వాటి స్పూర్తితోనే ఎం ఎస్ రాజు ఈ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఎస్.పి.జి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతుండగా, రుహిని శర్మ, సిమత్ర కౌర్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం ఎస్ రాజు చిత్రం కావటంతో… సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుంది.