శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2015 (12:23 IST)

''పులీ.... మ్యావ్ హ్‌హ్హ్...'' బాహుబలి, 'పులి'కి వాతలు పెట్టిన 'బాహుబలి'

అదిగో మళ్లీ సినేమా కథలు... ముత్యాలముగ్గులో తెలుగు విలన్ మన రావుగోపాల రావుగారి డైలాగ్ అది. సినిమా కథ అంటే వినడానికి బాగుంటే చాలదు. తెరపైకి ఎక్కించినప్పుడు చూసేందుకు కూడా బహుబాగుండాలి. కానీ మొన్న అక్టోబరు 1న విడుదలైన విజయ్ చిత్రం పులి... పులుపునే మిగిల్చింది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేసింది. ఒక దశలో ప్రభాస్, రానాల కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని అధిగమిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. 
 
కానీ చివరికి వేరేలా జరిగిపోయింది. పులి చిత్రం విడుదలైన మొదటి రోజు అది కేవలం 16 నుంచి 20 కోట్ల రూపాయల మధ్యనే వసూళ్లు రాబట్టకలిగింది. ఐతే బాహుబలి చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తొలిరోజు నాడే రూ. 40 కోట్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఐతే ఈ రెండు చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. బాహుబలి హైప్ అందుకుంది. కానీ విజయ్ పులి మాత్రం ఓడిపోయింది. దీనికి కారణం పులి చిత్రం స్క్రీన్ ప్లే, కథాగమనం, పాటలు అన్నీ బోరింగుగా సాగడమే. 
 
మరీ 15 నిమిషాలకో పాట వస్తూ ప్రేక్షకులను విసిగించేస్తాయి. చిత్రంలో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో సినిమా భవిష్యత్ కథ ఏమిటో ప్రేక్షకుడి చాలా సులభంగా గుర్తించేశాడు. వీటి కారణంగా పులికి కలెక్షన్ల పరంగా బాహుబలి ఒక రకంగా వాతలు పెట్టినట్లే.