శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (14:24 IST)

శివగామితో జక్కన్న సక్సెస్.. సౌమ్యాదేవితో చింబుదేవన్ డౌన్!

పులి సినిమా కోసం వచ్చిన ఛాన్సును శ్రీదేవి అంగీకరించడం.. బాహుబలిలో శివగామి పాత్రను తిరస్కరించడంతో అతిలోకసుందరిపై వివిధ రకాల కామెంట్స్ వచ్చేస్తున్నాయి. క్యారెక్టర్‌ను ఎంచుకోవడంలో శ్రీదేవి తప్పులేదని.. ఆ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు మెప్పించేలా తెరకెక్కించడమే కీలకమని సినీ పండితులు అంటున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పాత్రల ఎంపిక విషయంలో శ్రీదేవి ఆచితూచి వ్యవహరిస్తోంది. 
 
దక్షిణాది సినిమాల్లో వచ్చే అవకాశాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఓకే చేస్తోంది. అలా ఓకే చేసిన పాత్రే పులిలోని యవ్వన రాణి. విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వం వహించిన పులి చిత్రంలోని క్యారెక్టర్ ఇది. అయితే ఈ క్యారెక్టర్‌లో శ్రీదేవి సరిగ్గా నటించలేదని విమర్శలొస్తున్నాయి. పులి అట్టర్ ఫ్లాప్ కావడంతో శ్రీదేవి క్యారెక్టర్‌ నెగటివ్ అయిపోయిందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
మరోవైపు బాహుబలిలో శివగామి పాత్రను కాదనుకుని పులిలో యవ్వన రాణి క్యారెక్టర్‌ని ఎంపిక చేసుకున్నందుకు ఆమెకు తగిన శాస్తి జరిగిందని కొందరు అనుకుంటున్నారు. అయితే విషయంలో శ్రీదేవిది తప్పులేదు. నిజానికి పులిలోని యవ్వనరాణి క్యారెక్టర్‌లో బోలెడంత పెర్ఫామెన్స్‌కి అవకాశం ఉంది. ఇంకా యవ్వనరాణి క్యారెక్టర్‌లో బోలెడంత ఎమోషన్-క్రూరత్వం ఎలివేట్ అవ్వడానికి ఛాన్సుంది. 
 
అదే బాహుబలిలో శివగామి క్యారెక్టర్‌లో అన్ని ఎమోషన్స్ లేవు. రాయల్ లుక్‌తో రాణీగా కనిపించడానికి కేవలం శత్రువుపై కోపం ప్రదర్శించడానికే ఆ పాత్రకు స్కోప్ ఉంది. యవ్వనరాణిలో ఉన్నన్ని డైమన్షన్స్ లేవు. యవ్వనరాణి క్యారెక్టర్‌ని శ్రీదేవి ఎంచుకోవడం తప్పేమీ కాదు. అయితే ఓ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడంలో దర్శకుడి ప్రతిభ చాలా అవసరం. ఆ విషయంలో రాజమౌళి సక్సెస్ అయినంతగా చింబుదేవన్ సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. అదే శ్రీదేవి నెగటివ్ టాక్ తెచ్చిపెట్టింది. శివగామిగా నటించిన రమ్యకృష్ణకు పాజిటివ్ టాక్‌ను సంపాదించిపెట్టింది.