పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే టైమ్ వ‌చ్చింది... ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

mahesh-janaganamana
శ్రీ| Last Modified శుక్రవారం, 2 ఆగస్టు 2019 (20:28 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు పూరి జ‌గ‌న్నాథ్. గ‌త కొంత కాలంగా స‌క్స‌ెస్ లేక ఇబ్బంది ప‌డిన పూరి... ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ దూసుకెళుతున్నాడు. అయితే... పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్నారు.

క‌థ విని మ‌హేష్ ఓకే చెప్పారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. మ‌హేష్ నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో పూరి ఈ సినిమాని వెంక‌టేష్‌తో చేయాల‌నుకున్నారు. వెంకీకి క‌థ చెప్ప‌డం.. క‌థ విని వెంకీ కూడా ఇంట్ర‌ెస్ట్ చూపించిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇటీవ‌ల పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిసారని.. విజ‌య్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... విజ‌య్‌తో అస‌లు ఈ ప్రాజెక్ట్ అనుకోలేద‌ట‌. క‌న్న‌డ స్టార్ హీరో యాష్‌తో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆల్రెడీ యాష్, పూరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. స్టోరీ లైన్ విని యాష్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. అయితే... ఫుల్ స్టోరీ విన్న త‌ర్వాత చేయాలా..? వ‌ద్దా..? అనేది చెబుతానన్నాడ‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం పూరి ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ టూర్లో ఉన్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌ెస్ టూర్ కంప్లీట్ అయిన త‌ర్వాత పూరి యాష్‌కి జ‌న‌గ‌ణ‌మ‌న‌ ఫుల్ స్టోరీ చెబుతార‌ట‌. ఈ సినిమాని తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ స్ధాయిలో రూపొందించాలి అనుకుంటున్నార‌ట‌. మ‌రి... ఈ ప్రాజెక్ట్ పైన త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌స్తుందేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :