జయలలితపై వెబ్ సిరీస్.. కంగనా రనౌత్‌కు షాక్.. టీజర్ అదుర్స్ (video)
తమిళనాట దివంగత సీఎం జయలలితపై బయోపిక్స్ రెడీ అవుతున్నాయి. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ ఎవరికి వారు సపరేట్‌గా తీస్తున్నారు. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అయితే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించాడు. మొత్తం 14 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. దీనికి క్వీన్ అనే టైటిల్ పెట్టాడు గౌతమ్. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది.
ఈ వెబ్ సిరీస్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న విడుదలైన తలైవి టీజర్ కంటే ఇది అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు.
2016 డిసెంబర్‌లో జయలలిత అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ది ఐరన్ లేడీ అనే సినిమా వస్తుంది. తలైవి ఎలాగూ అందరికీ తెలిసిందే.
తాజాగా రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. జయ చిన్ననాటి జీవితం నుంచి మొదలుపెట్టి ఆమె స్కూల్ జీవితం ఎదిగిన విధానం ఆ తర్వాత సినిమాలు ఎంజీఆర్‌తో పరిచయం సినిమాల్లో స్టార్ డమ్.. ఆయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న విధానం అన్నీ చూపించాడు గౌతమ్ మీనన్. ఈ టీజర్‌ను లుక్కేయండి.