శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (08:41 IST)

నా సినిమాకు థియేటర్లు లేవు... ఏడుపొస్తోంది... : ఆర్ నారాయణ మూర్తి

దర్శకనిర్మాత, హీరో ఆర్. నారాయణమూర్తి చలించిపోయారు. తాను తీసిన చిత్రాన్ని విడుదల చేసేందుకు ఒక్క థియేటర్ కూడా దొరకక పోవడంతో ఆయన ఏం చేయోలో దిక్కుతోచలేదు. ఇదేంటని అడిగే పరిస్థితి ప్రస్తుతం పరిశ్రమలో లేదని

దర్శకనిర్మాత, హీరో ఆర్. నారాయణమూర్తి చలించిపోయారు. తాను తీసిన చిత్రాన్ని విడుదల చేసేందుకు ఒక్క థియేటర్ కూడా దొరకక పోవడంతో ఆయన ఏం చేయోలో దిక్కుతోచలేదు. ఇదేంటని అడిగే పరిస్థితి ప్రస్తుతం పరిశ్రమలో లేదని ఆయన వాపోయారు. 
 
నారాయణమూర్తి కథానాయకుడిగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ఒక్క థియేటర్ కూడా లభించలేదు. దీనిపై నారాయణ మూర్తి స్పందిస్తూ... 
 
'క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్న రోజలివి. 30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి నా సినిమా సంక్రాంతికి విడుదలవుతుంటే మెగాస్టార్‌, యువరత్న సినిమాల మధ్య పీపుల్‌స్టార్‌ సినిమా అని జనాలు అంటున్నారు. వారితో నాకు పోటీలేదు. సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసుకున్నాక థియేటర్లు దక్కలేదంటే ఏడుపొస్తుంది. మేం వందల థియేటర్లు ఆశించట్లేదు. నాలుగు థియేటర్లు ఉన్న ఊర్లో మాకు ఒక థియేటర్‌ ఇస్తే చాలంటున్నాం. ప్రభుత్వం, ఛాంబర్‌, నిర్మాతల మండలి ఇందుకు సహకరించాలి' అని ప్రాధేయపడ్డారు. 
 
'కొంతమంది చేతుల్లో థియేటర్లు ఉండటం వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దక్కట్లేదు. పండగలు, పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న సినిమాలు విడుదల చెయ్యాలా? చిన్నా పెద్ద తేడా లేకుండా తెరకెక్కిన ప్రతి సినిమా విడుదలైనప్పుడే పరిశ్రమ బావుంటుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.