ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:56 IST)

ప్రధాని మోడీకి జై కొడితే అవార్డు ఖాయం : పార్తిబన్

rparthiban
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని సినీ దర్శకుడు ఆర్.పార్తిబన్ అన్నారు. బాలీవుడ్ నటుడ్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చడ్డా".  ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. 
 
సినిమా సెలెబ్రిటీల కోసం ప్రివ్యూషోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించిన తర్వాత హీరో, నిర్మాత అమీర్ ఖాన్‌ను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆర్.పార్తిబన్ మాట్లాడుతూ, లాల్ సింగ్ చడ్డా చాలా అద్భుతంగా ఉందన్నారు. మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని ఆయన అన్నారు.
 
కాగా, ఆర్.పార్తిబన్ తెరకెక్కించిన "ఇరవిన్ నిళల్" చిత్రం దేశంలో నిర్మితమైన నాన్ లీనియర్ సింగిల్ షాట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అవార్డులు ఖాయమని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.