ఆర్.ఆర్.ఆర్. రైట్స్‌తో అందరికీ షాక్ ఇచ్చిన సంస్థ
రాజమౌళి చేస్తున్న రౌద్రం రణం రుధిరం” (`ఆర్.ఆర్.ఆర్.`) సినిమాపై క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాకు ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వచ్చే సూచనలు కన్పించేశాయి. సాధారణంగా ఇది తెలుగు సినిమా అంటే చాలు. దానికి తెలుగులో వున్న భారీ ఛానల్స్ పోటీ పడుతుంటాయి. శాటిలైట్ రైట్స్, జెమినీ, జీ టీవీలు ముందుంటాయి. ఇక ఆడియో, వీడియో, నెట్‌ప్లిక్స్ వంటివి కూడా తమ స్థాయికిత తగినట్లు వెతుకుతుంటాయి.
అయితే ఈసారి ఎవరికీ దక్కుండా ఏకంగా బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడాకు దక్కేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన ఒక్కటే మిగిలి వుంది. జయంతీలాల్ గడా తాజాగా `గంగూభాయ్` అనే సినిమా తీశారు. అది విడుదలకు సిద్ధమవుతోంది. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళంలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన గడా బాలీవుడ్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.
ఇక్కడ విశేషం ఏమంటే ఉత్తర భారతదేశ థియేట్రికల్ రైట్స్ తో పాటు.. అన్ని భాషలకు చెందిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ మొత్తాన్ని పెన్ ఇండియా సంస్థ దక్కించుకుంది. దీంతో ఇప్పటివరకు రేసులో ఉన్న అమెజాన్ ప్రైమ్, జీ తెలుగు, స్టార్ మా సంస్థలు వెనక్కి తగ్గాయి. అయితే దానికిముందే తెలుగు నిర్మాతలతోపాటు జీ జీ స్టూడియో గ్రూప్‌కూడా చర్చలు జరిపింది. కానీ ఎవరు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తే వారికే దక్కుతుందనే సినిమా వ్యాపారం వారంతా వెనకబడిపోయారు. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం పెన్ ఇండియా దాదాపు 400కోట్ల వరకు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.