శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (17:59 IST)

‘రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది.. దర్శకుడు దాసరి ఇస్సాకు

Director Dasari Issaku
Director Dasari Issaku
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి ఇస్సాకు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివే..
 
చిన్నతనం నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. అందుకే ఇంట్లోంచి పారిపోయి హైద్రాబాద్‌కు వచ్చాను. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని డిపార్ట్మెంట్‌లలో పని చేశాను. దర్శకత్వం మీదున్న ఆసక్తితో అన్నపూర్ణ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. దాని కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు కూడబెట్టుకునేవాడిని. అలా అన్నపూర్ణ ఇన్‌స్టిట్యూట్ నుంచి దర్శకత్వ శాఖలో ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చాను.
 
2019లో తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు పరిచయం అయ్యారు. ఆహా కోసం ఓ సినిమాను తీయాలని ముందుగా మేం కలిసి పని చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత నిర్మాత ఈ రాధా మాధవం కథను నాకు చెప్పారు. రైటర్ వసంత్ రాసిన ఈ కథను నాకు వినిపించడంతో బాగా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.
 
వినాయక్ దేశాయ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. మేం జిమ్ మేట్స్‌. వినాయక్ కటౌట్ బాగుంటుందని ఈ సినిమాకు తీసుకున్నాం. అయితే హీరోయిన్ కోసం చాలా వెదికాం. హీరో ఎత్తుకు సరిపోయేలా ఉండాలని చూశాం. కానీ అపర్ణా దేవీ యాక్టింగ్ బాగుంటుందని, హైట్ తక్కువైనా పర్లేదని ఆమెను తీసుకున్నాం. మేక రామకృష్ణ గారికి ఈ కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఓకే చేశారు.
 
రాధా మాధవం పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటితో మా సినిమా మీద బజ్‌ పెరిగింది. మా చిత్రంపై ఇంతటి పాజిటివ్ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందమేసింది. మ్యూజిక్ డైరెక్టర్ కొల్లి చైతన్య గారు మంచి పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఉంటుంది.
 
రాధా మాధవం సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఫ్యామిలీ మెచ్చే అంశాలతో పాటు యూత్‌ను అట్రాక్ట్ చేసే ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయి. ప్రేమతో పాటు మంచి సందేశాన్నిచ్చేలా రాధా మాధవం సినిమాను తెరకెక్కించాం. థియేటర్లో మంచి సినిమాను చూశామనే ఫీలింగ్‌తో ఆడియెన్స్ బయటకు వచ్చేస్తారు. మార్చి 1న రాబోతోన్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.