శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (19:55 IST)

హ‌స్త‌క‌ళ‌ల‌ను బ్ర‌తికించాలని చెప్పే‘రాధాకృష్ణ‌`.ఫిబ్ర‌వ‌రి 5న విడుద‌ల

Radhakrishna cinema team
ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది.
 
ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ, ``నిర్మాత‌గా ప‌‌రిచ‌య‌మ‌వుతున్న కృష్ణ‌కుమార్‌గారికి, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యంఅవుతున్న సోద‌ర‌స‌మానుడు ప్ర‌సాద్ వ‌ర్మకి నా అభినంద‌న‌లు. నిర్మ‌ల్‌లో పుట్టిపెరిగిన కృష్ణ‌కుమార్‌గారు నిర్మ‌ల్‌బొమ్మ‌ల నేప‌థ్యంలో ఒక సినిమాని చేయాల‌ని ఈ స‌బ్జెక్ట్ నా ద‌గ్గ‌ర‌కి తీసుకువ‌చ్చిన‌ప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి నాకు చేత‌నైనంత సాయం చేస్తాన‌ని ఆరోజే మాట ఇచ్చాను. ఆ ప్ర‌కారమే చేస్తూ వ‌చ్చాను. ఈ సినిమా విజ‌య‌వంతం అయ్యి మొద‌టిసారి నిర్మాత‌గా అడుగుపెట్టిన కృష్ణ‌‌కుమార్ గారికి డ‌బ్బులు రావాల‌ని  అలాగే ప్ర‌సాద్ వ‌ర్మ‌కి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా.

క‌థ‌ప‌రంగా చూస్తే, నిర్మ‌ల్ బోమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఒక క్యూట్ ల‌వ్‌స్టోరీ. కేవ‌లం ప్రేమ‌క‌థా చిత్రంగానే కాకుండా అంత‌రించి పోతున్న హ‌స్త‌క‌ళ‌ల‌ను బ్ర‌తికించాలి అని ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం.  అనురాగ్‌. ముస్కాన్ సేథి చాలా బాగా చేశారు. ఈ సినిమా ద్వారా వారికి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. ల‌క్ష్మిపార్వ‌తి గారు ఒక కీల‌క‌మైన పాత్ర చేయ‌డం జ‌రిగింది.  ఆమె పాత్ర‌కి త‌ప్ప‌కుండా మంచి ప్ర‌శంస‌లు వ‌స్తాయి.

కృష్ణ‌భ‌గ‌వాన్‌, అలీ కాంభినేష‌న్లో మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది. న‌వ‌ర‌సాల స‌మ్మేళ‌నం లాంటి సినిమా. కుటుంబ‌స‌మేతంగా అందరూ వ‌చ్చి హ్యాపీగా న‌వ్వుకునే సినిమా.  సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. ఎం.ఎం శ్రీ‌లేఖ‌గారి మ్యూజిక్ ఈ సినిమాకి త‌ప్ప‌కుండా ప్ల‌స్ అవుతుంది. మంచి టెక్నీషియ‌న్స్‌తో, మంచి ఆర్టిస్టుల‌తో చేసిన ఈ సినిమాని ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించి విజ‌య‌వంతం చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
చిత్ర నిర్మాణ సార‌థి పుప్పాల కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ, `ఈ ఫిబ్ర‌వ‌రి 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.శ్రీలేఖగారు..కొత్త నిర్మాత అయినప్పటికీ మా సినిమా ఒప్పుకుని అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల‌చేసిన అన్ని పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది.

హీరో అనురాగ్‌కి ఇది రెండో సినిమానే అయినా మొద‌టినుండి మా అంద‌రికీ ఎంతో స‌పోర్ట్‌గా ఉన్నారు. త‌న పాత్రలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. లక్ష్మీపార్వతి గారు ఈ సినిమాకి బ్యాక్‌బోన్‌గా ఉండ‌డంతో పాటు మొద‌టి సారి ఈ సినిమాలో ఒక కీల‌క‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. అలాగే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. పైసావ‌సూల్ ఫేమ్ ముస్కాన్‌ సేథిగారు కథ వినగానే ఒప్పుకుని అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిగా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్ చేశారు.

ఈ సినిమాతో ఆమె మరింత పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలీగారి కామెడీ ట్రాక్‌ సినిమాకు ప్లస్‌ అవుతుంది. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్‌. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్‌ చేశారు. మా హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ 'రాధాకృష్ణ' సినిమాను ఫిబ్ర‌వ‌రి5న ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ- ``ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఒక అంద‌మైన ల‌వ్‌స్టోరీతో పాటు హస్తకళలకు సంభందించిన మంచి పాయంట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది.  మా గురువుగారు శ్రీ‌నివాస్రెడ్డి ఈ చిత్రం ఇంత బాగా రావ‌డానికి ఎంతో స‌హ‌కారం అందించారు` అన్నారు.
 
న‌టుడు కృష్ణ‌భ‌గ‌వాన్ మాట్లాడుతూ- ``నిర్మ‌ల్ బొమ్మ‌ల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మంచి ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఎం.ఎం శ్రీ‌లేఖ‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరో హీరోయిన్స్‌గా అనురాగ్‌, ముస్కాన్ సేథీ చ‌క్క‌గా న‌టించారు. శ్రీ‌నివాస‌రెడ్డిగారు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు. ఆయ‌న కామెడి యాంగిల్ గురించి మ‌నంద‌రికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా  నేను, ఆలీ, వ‌నిత, చ‌మ్మ‌క్‌చంద్ర‌, ఫ‌ని క‌లిసి ఒక అద్భుత‌మైన కామెడీ ట్రాక్ చేయించారు. ఆ ట్రాక్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ కూడా న‌చ్చుతుంది. మంచి మ‌న‌సున్న కృష్ణ‌కుమార్‌గారికి ఈ సినిమాతో మ‌రిన్ని డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
 
న‌టుడు ఫ‌ణి మాట్లాడుతూ, ``ఇన్ని రోజులు మ‌నంద‌రం క‌రోనా వ్యాక్సిన్ గురించి ఎదురుచూశాం. అది వ‌చ్చేసింది. ఇప్పుడు అంద‌రూ ఎదురుచూసేది న‌వ్వుల వ్యాక్సిన్ కోసం అది ఈ సినిమాతో రాబోతుంది. సినిమా చూసి ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
 
హీరో అనురాగ్ మాట్లాడుతూ,``రాగ‌ల‌24 గంట‌ల్లో త‌ర్వాత నేను చేస్తోన్న రెండో చిత్ర‌మిది. మంచి సాఫ్ట్ ల‌వ్‌స్టోరీ. దానికి ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా బాగా కుదిరింది. ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మగారు ఒక స్వ‌చ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ‌ని చాలా ఆహ్లాదంగా చూపించారు. కృష్ణ‌కుమార్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మ‌రోసారి అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌నివాస‌రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. అలీగారు చాలా స‌పోర్ట్‌చేశారు. ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి న‌టించ‌డం జ‌రిగింది. శ్రీ‌లేఖ గారు ఒక్కో సాంగ్‌ని ఒక్కో జోన‌ర్‌లో కంపోజ్ చేశారు. ఫిబ్ర‌వ‌రి5న థియేట‌ర్‌లో సినిమా చూసి మ‌మ్మ‌ల్ని బ్లెస్ చేయండి`` అన్నారు.
 
సంగీత‌ద‌ర్శ‌కురాలు ఎం.ఎం శ్రీ‌లేఖ మాట్లాడుతూ - ``శ్రీ‌నివాస్ రెడ్డిగారు ఫోన్ చేసి ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలి అని చెప్ప‌గానే ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చేశారు కాబ‌ట్టి ఆయ‌న మీద న‌మ్మ‌కంతో వెంట‌నే ఒప్పుకున్నాను. సినిమాలో పాట‌లు చాలా బాగా కుదిరాయి. మా పాట‌ల్ని రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి థ్యాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 5న  అంద‌రూ సినిమా చూడండి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
 
అమేజాన్ రాజీవ్‌మాట్లాడుతూ, `ఓవ‌ర్సిస్‌లో ఉన్న తెలుగు అభిమానుల‌కోసం ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి5న అమేజాన్ ఓవ‌ర్సిస్‌లో రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), ల‌క్ష్మీ పార్వ‌తి, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి. వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌ కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.