శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (15:49 IST)

న్యూడ్ సీన్‌లో నటించేముందు భర్తకు చెప్పా.. తల్లిదండ్రుల నుంచి కూడా ప్రోత్సాహం: రాధికా ఆప్టే

భారత్‌లో శృంగార స్వేచ్ఛ రావాల్సిన సమయం ఆసన్నమైందని రాధికా ఆప్టే వెల్లడించింది. పర్చేడ్ సినిమాలోని రాధికా ఆప్టే, ఆదిల్ హుస్సేన్‌ల శృంగార వీడియో లీకై సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ

భారత్‌లో శృంగార స్వేచ్ఛ రావాల్సిన సమయం ఆసన్నమైందని రాధికా ఆప్టే వెల్లడించింది. పర్చేడ్ సినిమాలోని రాధికా ఆప్టే, ఆదిల్ హుస్సేన్‌ల శృంగార వీడియో లీకై సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే.. న్యూడ్ సీన్లలో నటించే స్వేచ్ఛ, స్వతంత్రాలు తన శరీరానికి ఉన్నాయని చెప్పింది.

సెక్సువాలిటీపై మహిళలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించింది. పర్చేడ్ సినిమాలోని న్యూడ్ సీన్లో నటించేముందు తన భర్తకు చెప్పానని, తనపై ఎంతో నమ్మకముండి ఆయన ఒప్పుకొన్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు, భర్త నుంచి వచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొంది.
 
పర్చేడ్ సినిమాకు సంబంధించిన శృంగార సీన్లను లీక్ చేశారని తెలియగానే ముందుగా ఆవేదన చెందానని రాధికా ఆప్టే తెలిపింది. దీనిపై మీడియా అడుగుతున్న ప్రశ్నలన్నీ అర్థం లేనివని అసహనం వ్యక్తం చేసింది. తాను ఓ పరిచయస్తుల ఇంట్లో ఉన్నప్పుడు.. ఆ వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నట్టు ఓ నిర్మాత నాకు మెసేజ్ పెట్టారని చెప్పింది. ఫస్ట్ టైం వీడియో లీకైనప్పుడు చాలా కోపం వచ్చిందని, ఇప్పడు మాత్రం నవ్వొస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
అయినా తనకెందుకు కోపం రావాలని ప్రశ్నించింది. ఆ సీన్స్ చేసేటప్పుడు తన శరీరం సౌకర్యంగానే ఉన్నదని.. వీడియో లీకైనప్పుడు ఎందుకిలా జరుగుతుందని కోపం వచ్చిందని.. ఒక మగాడు, ఓ మహిళ న్యూడ్ సీన్లలో నటించేటప్పుడు దృష్టి అనేది మహిళ  మీదే పడటం సహజమని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. 
 
సినిమాల్లో చిట్టి పొట్టి డ్రెస్సులేసుకుని డ్యాన్స్‌లు వేస్తున్నా.. జనాలు దానిని అసభ్యంగా చూడకుండా కళగా చూస్తే సరిపోతుంది. అలాగే న్యూడ్ సీన్లు వస్తే అసభ్యత అనడం అనేది సహజమైన విషయం. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన శరీరం ఏంటన్నది, తన అవయవాల గురించి ఓ స్పష్టమైన అవగాహన ఉందని స్పష్టం చేసింది. ఇక, సినీ రంగంలోకి వచ్చాక ఎంతో మంది తారలు న్యూడ్ సీన్లలో నటించడం తనకు స్ఫూర్తినిచ్చిందని, వాళ్లు అంత సౌకర్యంగా ఆ సీన్లలో చేయడం ఇంప్రెస్ చేసిందని చెప్పుకొచ్చింది.