Widgets Magazine Widgets Magazine

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:24 IST)

Widgets Magazine
raghava lawrence

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం సాగుతున్న పోటీలో పన్నీర్ సెల్వం, శశికళలు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతున్నారు. ప్రజా మద్దతు సంపూర్ణంగా పన్నీర్‌కు ఉంటే.. ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉంది. 
 
ఈ నేపథ్యంలో... జల్లికట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సినీ నటుడు, డాన్స్‌ మాస్టర్‌ రాఘవ లారెన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులోగల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. 
 
పన్నీర్‌ సెల్వం, ఇతర నేతలు ఆత్మీయ ఆలింగనాలతో రాఘవ లారెన్స్‌కు స్వాగతం పలికిన అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించానని, అన్నీ ఆలోచించిన మీదట పన్నీర్‌ సెల్వానికి మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 
 
జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లగల సత్తా ఓపీఎస్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. లారెన్స్‌ కంటే ముందే సీనియర్‌ కమల్ హాసన్, శరత్ కుమార్, ఖుష్బూ, గౌతమిలతో పాటు.. అనేక మంది పన్నీర్‌కు మద్దతు తెలిపిన విషయం తెలసిందే.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?

బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో ...

news

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి ...

news

శరవేగంగా ప్రభాస్ కొత్త సినిమా.. ఖర్చు రూ.150 కోట్ల మాత్రమేనట

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగేళ్లపాటు తన ...

news

బుద్ధుడి ముందు అలా చేయడం సాధారణం అంటోన్న హాట్ యాంకర్

యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం ...