ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (17:26 IST)

చంద్రముఖి 2 పోస్టర్.. రాఘవ లారెన్స్ హీరో... మేడపై గదినే చూపిస్తూ..?

Chandramukhi 2
Chandramukhi 2
2005లో  విడుదలైన చంద్రముఖి బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పి. వాసు దర్శకుడు. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి ఆయనతోనే  సీక్వెల్ ప్లాన్ చేశారుగానీ కుదరలేదు. 
 
రజనీ కాంత్ అంతగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ను లారెన్స్‌తో చేస్తున్నారు దర్శకుడు పి.వాసు. 
 
"చంద్రముఖి 2" టైటిల్ ను ఖరారు చేసి .. కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్‌ను వదిలారు. 'చంద్రముఖి'లో ఉత్కంఠను రేకెత్తించే మేడపై గదినే పోస్టర్‌‌లో చూపించారు. 
 
లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. లారెన్స్ - పి.వాసు కాంబినేషన్లో గతంలో 'శివలింగ' వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన చంద్రముఖి 2 పోస్టర్‌తో పాటు నిర్మాతలు తారాగణం, ఫోటో వివరాలను షేర్ చేశారు.