చెంప పగులగొట్టిన సహాయ నటుడు.. నటికి చెవి నుంచి రక్తం...

మంగళవారం, 21 నవంబరు 2017 (11:22 IST)

Ragini Dwivedi

సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిన్నపొరపాటు వల్ల హీరోయిన్ తీవ్రంగా గాయపడింది. సహాయ నటుడు చెంపపై కొట్టడంతో చెవి నుంచి నెత్తురు వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టాలీవుడ్ యువ హీరో నాని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం "జెండాపై క‌పిరాజు". ఇందులో మెరిసిన క‌న్నడ భామ రాగిణి ద్వివేది. తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగానే గుర్తుండి ఉంటుంది. త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ప‌లు చిత్రాల్లో ఆమె నటించింది. 
 
తాజాగా ఈ అమ్మ‌డు ముస్సంజె మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎస్‌.సి.హెచ్‌ అనే కన్నడ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో రాగిణి పోలీస్ అధికారి పాత్ర చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మినర్వమిల్‌లో ఫైటింగ్ స‌న్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా చిన్నపాటి అపశృతి జరిగింది. 
 
ఆ స‌మ‌యంలో స‌హాయ న‌టుడు చేయి రాగిణి చెవికి గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో ఆమె చెవి నుండి ర‌క్తం దార‌లుగా కారింద‌ట‌. వెంట‌నే ఆమెని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ప్ర‌స్తుతం రాగిణి ఆరోగ్యం మెరుగుప‌డిన‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ టీంతో క‌ల‌వ‌నుంద‌ట‌.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జగపతి బాబు పాదయాత్ర... రాజకీయ అరంగేట్రం చేస్తారా?

లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబుకు నంది అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. నంది ...

news

'పద్మావతి' దీపిక తలను కాపాడుకుందాం : కమల్ ట్వీట్

విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు బీజేపీ పాలకుల వైఖరిపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ చిత్రం ...

news

దీపిక తలకు రూ.10కోట్లు.. జీఎస్టీ కలిపారా? లేదా?: ట్వింకిల్ ప్రశ్న

పద్మావతి సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న ...

news

బట్టల వ్యాపారంలోకి సన్నీ లియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఒక్క బాలీవుడ్‌కే ...