శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (20:57 IST)

'సీతమ్మ అందాలతో...' రాజ్ తరుణ్ షాక్... దిల్ రాజు చిత్రం అంగీకారం...

రాజ్‌ తరుణ్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రం ఓ స్థాయిలో ఆడిందని అంటున్నా లెక్కల్లోకి వెళితే తేడాగా ఉందని ఫిలింనగర్ సమాచారం. దీనితో ఇప్పుడు ఏవైనా చిత్రాలు అంగీకరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నాడట. ఇదిలావుంటే తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 
 
ఇవివి దగ్గర మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చిన వేగ్నేష సతీష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దిల్‌ రాజు నాలుగు చిత్రాలను ప్రకటించారు. అందులో 'సుప్రీమ్‌' చిత్రాన్ని సాయిధరమ్‌ తేజ్‌తో చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక రాజ్‌ తరుణ్‌ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'శతమానం భవతి' అనే పేరు పెట్టారు. వేసవిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళనుంది.