ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (13:20 IST)

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

Raj Tarun's Ex-Lover Lavanya
Raj Tarun's Ex-Lover Lavanya
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. తననను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని  తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 
 
తాజాగా ఆయన నటించిన "తిరగబడరా సామీ" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటున్నాని నమ్మించి, వాడుకుని వదిలేశాడని ఆ యువతి ఆరోపించింది. తను ప్రేమించి.. శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లావణ్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 
 
దాదాపు 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో సహజీవనంలో ఉన్నానని ఆమె తెలిపింది.తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది. అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని తనను వదిలేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది. 
 
ఇంకా చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైలులో ఉన్నానని, ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదంటూ లేఖలో పేర్కొంది.