Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాస్ మ‌హారాజా ర‌వితేజ - అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్‌'

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (16:01 IST)

Widgets Magazine
raja the great movie still

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో 'ప‌టాస్'‌, 'సుప్రీమ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. 'వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్' ఉప శీర్షిక. సోమవారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 'ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది' అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... 'ర‌వితేజ‌తో చేస్తున్న విభిన్న కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టివ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజు బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌ అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం' అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు ...

news

చిరంజీవి... ఎప్పటికీ చిరంజీవినే... గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌

సుమారు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ...

news

హీరోయిన్‌తో ముద్దు సీన్.. 19 టేక్‌లు తీసుకున్న హీరో ఎవరు?

చిత్ర పరిశ్రమకు అనేక మంది కొత్తకొత్త హీరోహీరోయిన్లు పరిచయమవుతుంటారు. వారికి సన్నివేశాల్లో ...

news

అన్నయ్య చిరంజీవి లేకుంటే నేను జీరో : నటుడు నాగబాబు

తన జీవితంలో 20 యేళ్ళ స్తబ్ధుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఒక ...

Widgets Magazine