శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (18:04 IST)

నా కుటుంబంలో నేను పెద్ద బ్రాండెడ్ గజినీని: రాజమౌళి

మా కుటుంబంలో తానో పెద్ద బ్రాండెడ్ గజినీనని బాహుబలి మేకర్ రాజమౌళి చెప్పారు. మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన భలెభలె మగాడివోయ్ సినిమా ట్రైలర్‌పై రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ అంటే ఇలా ఉండాలని రాజమౌళి అభిప్రాయపడ్డారు. 
 
భలెభలె మగాడివోయ్ సినిమాలో మతిమరుపు వ్యక్తి పాత్రను నాని పోషిస్తుండగా, నిజ జీవితంలో ఆ పాత్ర తాను పోషిస్తున్నానని రాజమౌళి చెప్పాడు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా చెప్పారు. కాగా బాహుబలి 2 పనుల్లో రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్న రాజమౌళి, తన సినిమా ఈగ హీరో నాని లేటెస్ట్ మూవీ భలెభలె మగాడివోయ్ టీజర్‌‌ను చూసి ప్రశంసించారు.