శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:46 IST)

'మహాభారతం'కు ట్రైలర్‌గా 'బాహుబలి'... రాజమౌళి నెక్ట్స్ మూవీపై టాక్స్..

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయం సాధించిన బాహుబలి వసూళ్ల వర్షం కుమ్మరిస్తోంది. దీంతో రాజమౌళి బాహుబలి రెండో భాగంగాపై దృష్టిసారించారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం రాజమౌళి బాహుబలి తర్వాత తీయనున్న సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. 'బాహుబలి' తరువాత ఆయన 'మహాభారతం' చిత్రాన్ని తెరకెక్కించడానికి అవకాశం ఉందనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఈ ఊహాగానాలకి తెరతీసింది. విజయేంద్ర ప్రసాద్ ఒక టీవీ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, భారతీయులు గర్వించే స్థాయిలో మహాభారతాన్ని తెరకెక్కించాలనేది రాజమౌళి 'కల' అని అన్నాడు. తాను రూపొందిస్తోన్న బాహుబలి కూడా మహాభారతానికి ట్రైలర్ లాంటిదని తనతో రాజమౌళి అన్నట్లు చెప్పారు.

దాంతో బాహుబలి తరువాత రాజమౌళి చేయనున్న ప్రాజెక్ట్ 'మహాభారతం' కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి రాజమౌళి నిర్ణయమేమిటనేది తెలుసుకోవడానికి మరి కొంతకాలం ఎదురు చూడవలసిందే.