శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (15:27 IST)

మా అదృష్టం కొద్దీ శ్రీదేవి శివగామిగా ఒప్పుకోలేదు.. మహాభారతానికి నేను సరిపోనేమో? అల్లుఅరవింద్‌పై?: రాజమౌళి

బాహుబలి-2లో భల్లాలదేవ, బాహుబలి, శివగామి, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ పాత్రల్లో ఫస్ట్ మార్కులు రాజమౌళి శివగామికే వేశారు. శివగామి పాత్రకు శ్రీదేవిని ముందుగా అనుకున్నామని.. అయితే మా అదృష్టం బాగుండి శ్రీదే

''బాహుబలి''తో టాలీవుడ్ వైపు అందరినీ తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్‌తో మొదలుపెట్టి బాహుబలి-2 వరకు వరుస విజయాలు సాధించారు. బాహుబలి-2తో కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన రాజమౌళిని ఓ తెలుగు టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. బాహుబలి-2కి వచ్చిన ప్రశంసలను ఏనాటికీ మరిచిపోనని రాజమౌళి చెప్పారు. బాహుబలి కోసం ఎంతో కష్టపడ్డాం. సక్సెస్ కాకుంటే పరిస్థితి ఏంటని భయపడ్డామని రాజమౌళి వెల్లడించారు. 
 
బాహుబలి-2లో భల్లాలదేవ, బాహుబలి, శివగామి, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ పాత్రల్లో ఫస్ట్ మార్కులు రాజమౌళి శివగామికే వేశారు. శివగామి పాత్రకు శ్రీదేవిని ముందుగా అనుకున్నామని.. అయితే మా అదృష్టం బాగుండి శ్రీదేవి ఆ పాత్రకు ఒప్పుకోలేదన్నారు. రాజమౌళిని బట్టే ఓపెనింగ్స్ అనే కామెంట్స్‌పై జక్కన్న మాట్లాడుతూ.. హిట్స్ వస్తే కామెంట్స్ వస్తుంటాయి. అదే రెండు ఫ్లాప్‌లు ఇస్తే.. ప్రేక్షకుల, విశ్లేషకుల కామెంట్లు వెంటనే మారిపోతాయని కామెంట్ చేశారు. 
 
రమ్యకృష్ణ రోల్‌ను చూసి... వామ్మో ఈమె అందరినీ తినేస్తుంది. ఇంకా మనం కష్టపడాలి. ప్రేక్షకుల్ని శివగామి తనవైపు లాగేస్తుందని.. ప్రభాస్ అప్పుడప్పుడు అనేవాడని రాజమౌళి చెప్పారు. ఏపీ రాజధాని నిర్మాణంలో చేయిపెట్టే స్థాయి తనది కాదన్నారు. తాను ఎంత గొప్ప దర్శకుడో 'బాహుబలి' సినిమాతో నిరూపించుకున్న రాజమౌళికి.. హీరో రామ్ చరణ్‌ 'మగధీర'తో కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు.  
 
మగధీర విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌పై తనకు చాలా కోపాలు ఉన్నాయన్నారు. అందుకే 100 రోజుల ఫంక్షన్‌కు కూడా రాలేనని చెప్పినట్టు తెలిపాడు. అయితే... ప్రభాస్ విషయంలో మాత్రం తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని రాజమౌళి చెప్పాడు. ప్రభాస్ ను 'ఏం ప్రభాస్ రాజు గారూ' అని పిలిస్తే... తెగ ఇబ్బంది పడిపోతాడని తెలిపాడు. మహాభారతంకు దర్శకత్వం వహించే సత్తా తనలో వుందా అనే అనుమానం తనలో వుందని, టెక్నికల్ వాల్యూస్‌తో భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు తాను సరిపోతాననే సంశయంలో వున్నట్లు జక్కన్న చెప్పుకొచ్చారు.  
 
ఇకపోతే.. ప్రభాస్ ‘బాహుబలి-2’ సినిమాకు అమీర్ ఖాన్ దంగ‌ల్ సినిమా గ‌ట్టి పోటీనిస్తోంది. దంగ‌ల్ చైనాలో విడుద‌లైన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆ సినిమా దూసుకుపోతుండ‌డంతో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ‘బాహుబలి-2’ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం రూ.1530 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధిస్తే, ‘దంగల్’ చైనాలో సృష్టిస్తోన్న ప్ర‌భంజ‌నంతో మొత్తం రూ.1743 గ్రాస్‌ వసూళ్లు సాధించిందని ప్రముఖ విశ్లేష‌కుడు హరిచరణ్‌ పుడిపెద్ది వెల్ల‌డించారు. 
 
ఈ నెల 5న చైనాలో విడుదలైన దంగల్ ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం రూ. 810 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో బాహుబ‌లి-2ను దాటేసింది. అయితే, బాహుబ‌లి-2 చైనాలో ఇంకా విడుద‌ల కాలేదు. త్వ‌ర‌లోనే ‘బాహుబ‌లి-2’ టీమ్ ఈ సినిమాను చైనాలో విడుద‌ల చేయ‌నుంది.