సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (21:54 IST)

"ఆర్ఆర్ఆర్" మూవీ తేదీని లీక్ చేసిన ఐరిష్ నటి (video)

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో అలియా భట్ ఓ హీరోయిన్ కాగా, ఐరిష్ నటి అలిసన్ డూడీ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం విడుదల తేదీని డూడీ తాజాగా లీక్ చేసింది. 
 
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ పొరపాటున చిత్ర విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. 'ఆర్ఆర్ఆర్' సినిమా 2021, అక్టోబర్ 8న విడుదల కాబోతున్నట్టు అలిసన్ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిందట. 
 
ఇది వైరల్ కావడంతో కొద్ది సేపటికే ఆమె తన పోస్టును డిలీట్ చేసింది. ఈ లోపే ఆమె పోస్టును చూసిన చాలా మంది `ఆర్ఆర్ఆర్` విడుదల తేదీ ఇదే అంటే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రం హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.