గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (15:54 IST)

రాజశేఖర్ క‌థానాయ‌కుడిగా మాన్‌స్టర్ ప్రారంభం

Dr. Rajasekhar,  Pawan Sadineni, Beckem Venu Gopal, Sivakumar, jeevita
Dr. Rajasekhar, Pawan Sadineni, Beckem Venu Gopal, Sivakumar, jeevita
రాజశేఖర్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మించనున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు 'మాన్‌స్టర్‌' టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ కథానాయకుడి పవర్ ఫుల్ పాత్రని ఎస్టాబ్లెస్ చేసింది.
 
పవన్ సాదినేని ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్‌ కథ ఇది. ఈరోజు ముహూర్తం కార్యక్రమంతో లాంచైన ఈ సినిమాలో రాజశేఖర్ ఓ మాన్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు.
 
హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లతో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు.  
 
ఈ చిత్రానికి ఎమ్ జిబ్రాన్ సంగీతం అందించగా, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా పని చేస్తుండ‌గా,  రాకేందు మౌళి డైలాగ్స్ రాస్తున్నారు.  హుస్సేన్ ష కిరణ్, వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లేని అందించారు. శ్రీనివాస్ నారిని ప్రొడక్షన్ డిజైనర్.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు