71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న రజనీకాంత్  
                                       
                  
                  				  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో చెన్నై, పోయస్ గార్డెన్‌లో ఉన్న ఆయన నివాసం రజనీ అభిమానులతో సందడిగా మారింది. తన అభిమాన హీరోను చూసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు రజనీకాంత్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 
				  											
																													
									  
	 
	దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారుు. అలాగే, రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు అనేక రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.