గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (14:06 IST)

అపోలోలో చేరిన సూపర్ స్టార్.. కరోనా నెగటివ్ వచ్చినా..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ ఎక్కువ కావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని అపోలో యాజమాన్యం ధృవీకరించింది. అన్నాత్తే సినిమా షూటింగ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. రజనీకాంత్ పాల్గొన్నారు. అయితే కొందరికీ కరోనా రావడంతో షూటింగ్ నిలిపివేశారు. రజనీకాంత్ మాత్రం హైదరాబాద్‌లో ఉన్నారు. ఇవాళ ఇబ్బందిగా ఫీలవడంతో అపోలోలో చేర్పించారు.
 
సినిమా షూటింగ్ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రజనీకాంత్‌కు కరోనా వైరస్ పరీక్ష కూడా చేశారు. అయితే నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇవాళ అస్వస్థతకు గురవడంతో ఆందోళన నెలకొంది. ఆయన అభిమానులు ఒక్కొక్కరు ఆస్పత్రికి చేరుకుంటారు. హెల్త్ సిచుయేషన్ బాగుందని.. అపోలో యాజమాన్యం తెలిపింది. కాసేపట్లో మరో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది. రాజకీయ పార్టీ పెడతానని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో.. రజనీ పార్టీ పెడితే.. అన్నాడీఎంకే, డీఎంకే కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కమల్ హాసన్ కూడా కలిసి పనిచేద్దామని కోరిన సంగతి తెలిసిందే. ఇంతలో రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో ఫ్యాన్స్ టెన్షన్‌కు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.